రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వం రోజుకో అబద్ధం ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి మాయమైన డబ్బుపై ప్రశ్నిస్తే అధికారులు ఎల్ కేజీ పిల్లల్లా ట్రీట్ చేస్తున్నారని...పిట్టకథలు చెబుతున్నారంటూ మండిపడ్డారు ఆయన. ప్రభుత్వం స్పందించి ఏం జరిగిందో చెప్పని పక్షంలో న్యాయపోరాటనికి వెనుకాడమని సూర్యనారాయణ హెచ్చరించారు.